: ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా కలవనున్న సీఎం చంద్రబాబు


పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, జిల్లాలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపిస్తుండటంపై స్పందించిన చంద్రబాబు, పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వయంగా నడుంబిగించారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కలసి మాట్లాడాలని నిర్ణయించుకున్న ఆయన, అందరినీ తన వద్దకు రావాలని ఆదేశించారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం ఎస్ఐ, రైటర్‌ లను నిర్బంధించిన విషయంలో తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇంటికి పిలిచి నిర్బంధించడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు కాగా, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించిన సమావేశంలో మిగతా ఎమ్మెల్యేలంతా రాధాకృష్ణ వెనక నిలిచారు. పోలీసుల చర్యలపై ఆగ్రహంతో తమకున్న గన్ మెన్ లను వెనక్కు పంపారు. ఎమ్మెల్యేల ఆగ్రహం వెనక కారణాలు తెలుసుకుని, వివాదం మరింతగా ముదరకుండా చేసే ఉద్దేశంతో చంద్రబాబు అందరినీ పిలిచి మాట్లాడనున్నారు.

  • Loading...

More Telugu News