: చలపతిరావుపై తీవ్రమైన విమర్శలు చేసిన హీరో రామ్


మహిళల గురించి చులకనగా కామెంట్ చేసిన సీనియర్ నటుడు చలపతిరావుపై యంగ్ హీరో రామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. 'మహిళలపై మీరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీ నుంచి మేము ఎలాంటి క్షమాపణలు కోరడం లేదని' ట్వీట్ చేశాడు. ఇన్ని సంవత్సరాల వయసు వచ్చినా మహిళల యొక్క నిజమైన విలువ ఏంటో మీరు తెలుసుకోకపోవడం పట్ల తాము చింతిస్తున్నామని చెప్పాడు. 'మహిళల పట్ల మా జనరేషన్ కు మీలాంటి అభిప్రాయాలు కాకుండా... విభిన్నమైన అభిప్రాయం వుంది... మహిళను మేము చాలా గౌరవిస్తాం... అందుకు మేము ఎంతో గర్విస్తున్నామ'ని తెలిపాడు. మహిళల విలువను మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఇప్పటికీ మిమ్మల్ని మేము ప్రేమిస్తూనే ఉన్నామని ట్విట్టర్లో తెలిపాడు. 

  • Loading...

More Telugu News