: ఇకపై నేనేంటో చూపిస్తా: చంద్రబాబు


ఫ్యాక్షన్ హత్యలు సహజమని, ఎవరో ఎవరినో పాత పగల నేపథ్యంలో హత్య చేస్తే, ప్రభుత్వంపై అభాండాలు వేయడం ఎంతవరకూ సమంజసమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు విపక్షాలను ప్రశ్నించారు. హత్యలు జరగడం దురదృష్టకరమని, వీటిని ఎవరైనా ఖండించాల్సిందేనని చెప్పిన ఆయన, హంతకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కర్నూలు హత్యల విషయంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి వుందని, ఈ హత్యల నేపథ్యాలను ప్రజలకు వివరించి చెబుతామని అన్నారు.

పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఇకపై నేనంటే అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. నేతల్లో క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోయిందని చెప్పిన ఆయన, ప్రకాశం ఘటనపై కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. కమిటీ నివేదిక వచ్చిన తరువాత తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నామని గుర్తు చేసిన ఆయన, భవిష్యత్తులోనూ అలాగే ఉంటామని, మిత్రధర్మాన్ని పాటిస్తామని తెలిపారు. బీజేపీ నేతలు ఎవరైనా టీడీపీ నేతలను విమర్శిస్తే, ఆ పార్టీ అధిష్ఠానమే చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News