: తమిళ సినీ నటుడిపై భార్య వేధింపుల కేసు!
కోలీవుడ్ హాస్య నటుడు బాలాజీపై చెన్నై శివార్లలో ఉండే మాధవరం పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు నమోదైంది. ఆయన భార్య నిత్య (30) స్వయంగా కేసు పెట్టింది. పోలీసుల కథనం మేరకు బాలాజీ, నిత్యలు ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుని, మాధవరంలోని శాస్త్రినగర్ లో నివాసం ఉంటున్నారు. రియాల్టీ షోలలో బిజీగా ఉన్న సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, బాలాజీ తనను అనుమానిస్తున్నాడని... శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని నిత్య ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, కులం పేరుతో తనను దూషించాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. బాలాజీ కన్నడ బ్రాహ్మణుడు కాగా, నిత్య ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అమ్మాయని తెలుస్తోంది.