: సినిమా కోసం స్కిన్ టోన్ పై కత్రినా కైఫ్ ప్రయోగం!
ఓ సినిమాలో అందంగా కనిపించాలన్నా, అంద విహీనంగా కనిపించాలన్నా మేకప్ ప్రధాన భూమిక పోషిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, విలక్షణంగా ఆలోచించే కొందరు నటీనటులు తాము పోషించే పాత్ర కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడా జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కూడా చేరిపోయింది. 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రం కోసం ఏకంగా ఆమె తన స్కిన్ టోన్ ను మార్చుకోవాలని నిర్ణయించుకుందట.
కత్రినాకు ప్లస్ పాయింటే చర్మపు రంగని అత్యధికులు భావిస్తుంటే, ఓ సినిమా కోసం శరీర ఛాయను తగ్గించుకోవాలని భావించి నిత్యమూ డర్మటాలజిస్ట్ దగ్గరకు వెళుతోందట. ఈ పాత్రకు మేకప్ సరిపోతుందని తొలుత అనుకున్నప్పటికీ, తన సీన్స్ అన్నీ రియల్ గా కనిపించాలన్న ఉద్దేశం కత్రినా నిర్ణయం వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్, అమీర్ ఖాన్ తదితర దిగ్గజ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే.