: నేను కోటీశ్వరుడనయ్యానోచ్...!: సెహ్వాగ్ ట్వీట్


టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్, ట్విట్టర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ తాను కోటీశ్వరుడయ్యానంటూ ప్రకటించాడు. అదేంటి, సెహ్వాగ్ ఇప్పుడు కోటీశ్వరుడవ్వడమేంటన్న అనుమానం వచ్చిందా?... దేశం తరపున ఎన్నో మ్యాచ్ లు ఆడి, టన్నుల కొద్దీ పరుగులు చేసిన సెహ్వాగ్ ఆర్థికంగా ఎప్పుడో కోటీశ్వరుడు. అయితే తాజాగా ట్విట్టర్ లో కోటీశ్వరుడయ్యాడు. అంటే ట్విట్టర్ సామాజిక మాధ్యమంలో ఆయనను అనుసరిస్తున్నవారి సంఖ్య కోటి మందికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పది సెకెన్ల నిడివి గలిగిన వీడియోను పోస్టు చేసిన సెహ్వాగ్...10 మిలియన్ యూజర్లను చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశాడు.  






  • Loading...

More Telugu News