: తైవాన్ లో నూతనంగా చేసిన 'గే' వివాహాల చట్టంపై నేడు కోర్టు తీర్పు!


ఆసియాలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు తైవాన్ సిద్ధమైంది. గే వివాహాలను చట్టబద్ధం చేస్తూ తీసుకొచ్చిన చట్టంపై నేడు (బుధవారం) కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. కోర్టు తీర్పు కనుక ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే గే వివాహాలు (స్వలింగ  సంపర్కుల వివాహాలను) చట్టం బద్ధం చేసిన ఆసియాలోనే తొలి దేశంగా అవతరించనుంది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని గేలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆనందంలో ఉండగా సంప్రదాయవాదులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

సమాజాన్ని విభజించే ఇటువంటి చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేటి మధ్యాహ్నం సెంట్రల్ తైపేయిలో గే వివాహాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు గే వివాహాలకు సంబంధించి 14 మంది న్యాయమూర్తులు తీర్పును ఆన్‌లైన్‌లో వెలువరించనున్నారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని గే హక్కుల ప్రచారకర్త చి చియా వే (59) ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కోర్టుకు తెచ్చిన వారిలో చి కూడా ఒకరు. కోర్టు తీర్పు కనుక అనుకూలంగా వస్తే అది మరుసటి రోజు నుంచే అమల్లోకి వచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సుదీర్ఘ గడువు ఇవ్వరాదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News