: నేతల కుస్తీలు మామూలే... చర్చిస్తాం: లోకేష్
తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు సర్వసాధారణమేనని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఒకే ప్రాంతంలో ఇద్దరు బలమైన నేతలు ఒకే పార్టీలో ఉన్నప్పుడు వారి మధ్య ఆధిపత్య పోరు మామూలేనని, సమస్యలు ఎక్కడైనా వస్తే, అంతర్గత వేదికలపై చర్చించి పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు. నిన్న ప్రకాశం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య జరిగిన బాహాబాహీపై ఆయన స్పందించారు. ఏవైనా గొడవలు ఉంటే బయటపడి పార్టీ పరువు తీయవద్దని, ఎలాంటి సమస్యనైనా అధిష్ఠానం పరిష్కరిస్తుందని నేతలకు లోకేష్ హితవు పరికారు. ఈ వేసవి ముగిసేలోపు రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు రానీయకుండా చూస్తున్నామని తెలిపారు.