: మేజర్ నితిన్ గొగొయ్ కు శుభాకాంక్షలు చెప్పిన సెహ్వాగ్


టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్, ట్విట్టర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ కశ్మీర్ లో సహచరులను రక్షించేందుకు ఓ కశ్మీరీని జీపుకు కట్టేసిన ఆర్మీ అధికారి మేజర్ లీతుల్ గొగోయ్ ని అభినందించాడు. కశ్మీరీని జీపు ముందు భాగంలో కట్టి మానవ కవచంగా వాడుకున్న సైన్యాధికారి మేజర్‌ లీతుల్‌ గొగోయ్‌ని ఇటీవల సైన్యం ప్రతిభా పురస్కారంతో సత్కరించించింది. దీనిపై సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ ‘మేజర్‌ నితిన్‌ గొగోయ్‌, ప్రతిభా పురస్కారం అందుకున్నందుకు మీకు శుభాకాంక్షలు. మన సైనికులను సురక్షితంగా రక్షించేందుకు శాయశక్తులా కృషిచేయడం, మరిన్ని ఇతర అత్యద్భుతమైన విధులు నిర్వహించినందుకు’ అంటూ ట్వీట్‌ చేశాడు. అలాగే..తాజాగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన దాడులను కూడా అభినందించాడు. గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. ఆ ట్వీట్స్ మీరు కూడా చూడండి.





  • Loading...

More Telugu News