: పని ముగించుకుని ఇంటికి వస్తున్న కార్మికురాలిపై గ్యాంగ్ రేప్!


20 రోజుల క్రిందట ఉపాధి కోసం హైదరాబాదుకు వచ్చి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న మహిళపై సామూహిక అత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... భవన నిర్మాణ రంగ కార్మికురాలిగా పనిచేస్తున్న బాధితురాలు (35) పని ముగిసిన అనంతరం రాత్రి 10:30 నిమిషాలకు ఉప్పల్ ప్రధాన రహదారిపై ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆమె నల్ల చెరువు వద్దకు చేరుకునేసరికి బైకులపై ఇద్దరు యువకులు ఆమెను వెంబడిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించారు.

అప్రమత్తమయ్యేలోపు ఆమె నోట్లో తువ్వాలు కుక్కి, పీర్జాదిగూడ ప్రభుత్వ పాఠశాల పక్కనున్న నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను స్థానిక ఆలయం వద్ద వదిలేసి పారిపోయారు. అటుగా వెళ్తున్న వారు ఆమెను గమనించి, పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటనా స్థలికి చేరుకుని, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఐపీసీ 376 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి, ఆ దారిలోని సీసీ కెమెరా పుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News