: నా చిన్నప్పుడు మా అమ్మానాన్నల మీద ద్వేషం పెంచుకున్నా...పెద్దయ్యాక మారాను: పరిణీతి చోప్రా


బాలీవుడ్ ను తాజాగా 'ప్యారీ బిందు'గా అలరించిన ప్రియాంకా చోప్రా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ఏర్పాటు చేసిన బాలికల మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరం ముగింపు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన చిన్నతనంలో ఆర్థిక కష్టాలు ఉండేవని తెలిపింది. ఆ సమయంలో తాను స్కూల్ కు వెళ్లేందుకు తన తండ్రి తనకు సైకిల్ కొనిచ్చారని చెప్పింది. సైకిల్ పై వెళ్తుంటే అబ్బాయిలు అల్లరి చేస్తారేమోనని, తన సైకిల్ ను తన తండ్రి అనుసరించేవారని గుర్తు చేసుకుంది. తన తండ్రి బిజీగా ఉండి రాలేకపోయినప్పుడు మాత్రం, తన స్కర్టును లాగుతూ అబ్బాయిలు కామెంట్లు చేసేవారని చెప్పింది.

 అంతే కాకుండా మినీ స్కర్టు వేసుకుని సైకిల్ తొక్కడం చాలా ఇబ్బందిగా ఉండేదని గుర్తుచేసుకుంది. దీంతో తన తల్లిదండ్రులంటే కోపం వచ్చేదని, వారిపై ద్వేషం పెంచుకున్నానని చెప్పింది. కాలం గడిచే కొద్దీ వారిని అర్థం చేసుకున్నానని, దీంతో వారిపై జాలి కలిగిందని, ఇప్పుడు ప్రేమ ఉందని తెలిపింది. చిన్నప్పుడు తాను భయపడ్డట్టుగా ఎవరూ భయపడకూడదని, అక్షయ్ ఇలాంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఇక్కడ మెలకువలు నేర్చుకున్నవారు ధైర్యంగా ఉండొచ్చని చెప్పింది.

  • Loading...

More Telugu News