: ‘సేవ్ ది ఫార్మర్’ అంటున్న మంచు మనోజ్


‘సేవ్ ది ఫార్మర్’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను తాను ఏర్పాటు చేయనున్నట్టు సినీ హీరో మంచు మనోజ్ వెల్లడించాడు. సంవత్సర ఆదాయంలో ఒక రోజు సంపాదనను రైతులకు ఇస్తామని, పండించే రైతుకు పట్టెడన్నం పెట్టాలనేదే తమ సంస్థ లక్ష్యమని అన్నాడు. ఈ విషయంలో పరిశ్రమలోని నటీనటులంతా ముందుకు రావాలని ఈ సందర్భంగా మనోజ్ కోరాడు. తన ఆశయ సాధనకు అండగా నిలిచే మంత్రి కేటీఆర్, దర్శకుడు రాజమౌళి, నటుడు రానా, సాయిధరమ్ తేజ్, ఎంటర్ ప్రెన్యూర్ జీవీ కేశవరెడ్డి లు ఏడాదిలో ఒక్క రోజు వేతనాన్ని తమ సంస్థకు ఇవ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News