: ‘జేమ్స్ బాండ్’ హీరో రోజర్ మూర్ మృతి!


'బాండ్.. జేమ్స్ బాండ్’ అంటూ తనదైన స్టయిల్ లో పలుకుతూ, పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన 'జేమ్స్ బాండ్' హీరో సర్ రోజర్ మూర్ (89) మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కొద్ది కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తమ తండ్రి ఈ రోజు మృతి చెందారని, బరువెక్కిన హృదయాలతో ఈ బాధాకరమైన వార్తను తెలియజేస్తున్నామని ట్విట్టర్ ఖాతా ద్వారా రోజర్ మూర్ పిల్లలు తెలిపారు.

స్విట్జర్లాండ్ లో మృతి చెందిన రోజర్ మూర్ అంత్యక్రియలు మొనాకోలో నిర్వహించనున్నారు. కాగా, బాండ్ చిత్రాలలో ‘స్పై’ పాత్రలో రోజర్ మూర్ నటించారు. ‘లివ్ అండ్ లెట్ డై’, ‘స్పై హూ లవ్డ్ మీ’, ‘ఆక్టోపసీ’, ‘ఫర్ యువర్ ఐస్ ఓన్లీ’, ‘ఏ వ్యూ టూ ఏ కిల్’ సినిమాల్లో రోజర్ మూర్ ‘జేమ్స్ బాండ్’ పాత్రలు పోషించారు. ‘ది లాస్ట్ టైమ్ ఐ సా ప్యారిస్’, ‘ఇంటరప్టెడ్ మెలోడీ’, ‘ది కింగ్స్ థీఫ్’, ‘ది మిరాకిల్’ తదితర చిత్రాల్లో రోజర్ మూర్ నటించారు.

  • Loading...

More Telugu News