: 8 నిమిషాల్లో 2.5 లక్షల షియోమీ రెడ్మి-4 స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి!
షియోమీ రెడ్మి 4 స్మార్ట్ ఫోన్లను ఈ రోజు మధ్యాహ్నం ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచిన విషయం తెలిసిందే. ఎప్పటిలాగే రెడ్మి 4 ఫోన్లకు కూడా భారత్‌నుంచి భారీగా స్పందన వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో సాంకేతిక సమస్య వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభించగానే కేవలం 8 నిమిషాల్లోనే 2.5 లక్షల రెడ్మి ఫోన్లు అమ్ముడుపోయాయి.
ఈ విక్రయాలపై షియోమీ సంస్థ స్పందిస్తూ, తమ రెడ్మి 4 సేల్‌తో భారత్‌లో హ్యాట్రిక్ సాధించామని తెలిపింది. ఈ ఏడాది జనవరి 23న రెడ్మి నుంచి నోట్ 4 ఫోన్ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా కేవలం 10 నిమిషాల్లో 2.5 లక్షల ఫోన్లు అమ్ముడు పోయాయి. రెండు నెలల తర్వాత మార్చి 23న రెడ్మి 4ఏ సిరీస్‌ను అమ్మకానికి పెట్టగా 4 నిమిషాల్లోనే 2.5లక్షల ఫోన్ల ఆర్డరు వచ్చాయి. ఈ రోజు కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే తమ స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోవడంతో షియోమీ ఈ సక్సెస్ ను హ్యాట్రిక్‌గా పేర్కొంది.
Howzat!! It's a hat-trick! Redmi Note 4 followed by Redmi 4A and now Redmi 4. Can't thank all you #MiFans enough for so much love! <3 pic.twitter.com/b8N3iFT4zy
— Redmi India (@RedmiIndia) May 23, 2017