: మాంచెస్టర్ దాడి ప్రభావం.. నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు!
మాంచెస్టర్ లో ‘ఉగ్ర’ దాడి, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడటంతో ఈ రోజు భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 206 పాయింట్లకు పైగా కోల్పోయి 30,365 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 9,386 వద్ద ముగిశాయి. మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, విప్రో, హెచ్ఎల్ సీ టెక్నాలజీస్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ లో అదానీ పోర్ట్స్, అరబిందో ఫార్మా, సిప్లా షేర్లు నష్టపోయాయి.