: మాంచెస్టర్ షాపింగ్ మాల్ లో బాంబు వదంతులు!
ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ లో ఐసిస్ దారుణానికి పాల్పడి కొన్ని గంటలైనా గడవకముందే మళ్లీ బాంబు పేలుళ్లు జరగబోతున్నట్టు వస్తున్న వార్తలు కలకలం లేపాయి. అక్కడి అర్న్ డాలే షాపింగ్ సెంటర్ లో బాంబు దాడి జరగబోతున్నట్టు వదంతులు తలెత్తడంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎటువంటి బాంబులు లేవని తేలిన తర్వాత అర్న్ డాల్ మాల్ ను తిరిగి తెరిచారు. సదరు మాల్ లో ఓ 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మాంచెస్టర్ లోని అరెనాలో సోమవారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడితో ఈ వ్యక్తికి సంబంధం ఉందా? అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.