: మమ్మల్ని మోదీ పొగుడుతుంటే.. అమిత్ షా విమర్శించడం ఏమిటి?: టీఆర్ఎస్


తెలంగాణకు సంబంధించిన పరిస్థితులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఎలాంటి అవగాహన లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు ఆయనకు అవాస్తవాలను చెప్పి, ఆయన చేత మాట్లాడించారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోను టీఆర్ఎస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తోందని... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి, ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారని... ఎవరి అకౌంట్ లోనైనా డబ్బులు పడ్డాయా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నది బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో కాదా? అని నిలదీశారు. అత్యధిక మొత్తంలో రైతు రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఓవైపు ప్రధాని మోదీ మెచ్చుకుంటుంటే... మరోవైపు అమిత్ షా విమర్శించడం సరైంది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News