: లాలూ కూతురికి షాక్.. ఆమె వద్ద పనిచేసే చార్టర్డ్ అకౌంటెంట్ అరెస్టు!
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి వద్ద చార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేసే రాజేష్ అగర్వాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో రాజేష్ అగర్వాల్ ను అరెస్టు చేసి ఢిల్లీలోని ఒక కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా, న్యూఢిల్లీలో ఓ ఫాంహౌస్ కొనుగోలు చేసే నిమిత్తం ఒక షెల్ కంపెనీ ద్వారా మీసా భారతి మనీలాండరింగ్ కు పాల్పడ్డారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ ఇటీవలే ఆరోపించారు. ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు పేరిట తన వద్ద నల్లధనాన్ని మీసా భారతి మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆమె సీఏను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.