: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బాబుకు ఆహ్వానం
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావలసిందిగా లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన లేఖ రాశారు. ఈ నెల 7న పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత కోసం ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరితోపాటు టీడీపీ పోటీ పడిన సంగతి తెలిసిందే. చివరకు ఈ అవకాశం పురందరేశ్వరికే దక్కింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు.