: నాకు జ్యోతిష్యం తెలుసు... మోదీ ప్రభుత్వం కూలిపోతుంది: లాలూ
మోదీ ప్రభుత్వం త్వరలోనే అధికారాన్ని కోల్పోతుందని... తనకు జ్యోతిష్యం కూడా తెలుసని, అందుకే ఈ విషయాన్ని కచ్చితంగా చెబుతున్నానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. లాలూకు సంబంధించిన 22 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగా... ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 చోట్ల ఎక్కడెక్కడ దాడులు చేశారో చెప్పాలని, ఆ ప్రాంతాలు ఏవో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనను కూడా పూర్తి చేసుకోదని ఆయన జోస్యం చెప్పారు.