: తగ్గిన బంగారం ధర... పెరిగిన వెండి ధర!


మార్కెట్లో ఈ రోజు బంగారం ధ‌ర‌లు కాస్త‌ త‌గ్గాయి.10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.235 తగ్గి రూ.28,915 గా న‌మోదైంది. గ‌త కొన్ని రోజులుగా ప‌సిడి ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. అంతర్జాతీయ ప‌రిస్థితుల ప్ర‌భావం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు త‌గ్గిపోవ‌డంతో ప‌సిడి ధ‌ర‌లు ఈ రోజు దిగివ‌చ్చాయి. మ‌రోవైపు వెండి ధర మాత్రం ఈ రోజు రూ.315 పెరిగింది. దీంతో కిలో వెండి ధ‌ర‌ రూ.39,815గా న‌మోదైంది. గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఔన్సు  ప‌సిడి ధర 0.02 శాతం తగ్గి 1,260.10 డాలర్లుగా న‌మోదైంది.

  • Loading...

More Telugu News