: పవన్ కల్యాణ్ ఆవేదన సరైనదే.. ఆయన మాటల్లో వాస్తవముంది!: రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమర్థించారు. ఆయన మాటల్లో వాస్తవముందని... ఆయన ఆవేదన సరైనదేనని చెప్పారు. ఎన్నికల్లో పొత్తులనేవి చాలా సహజమైన ప్రక్రియ అని చెప్పారు. తెలంగాణలోని పార్టీలన్నీ కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయని చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామని తెలిపారు. పార్టీ అభివృద్ధి ప్రణాళికే లక్ష్యంగా మహానాడును నిర్వహిస్తున్నామని... ఐదు కీలక అంశాలపై తమ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు.