: జగన్ ముఖ్యమంత్రి అయితే సర్వనాశనమే: జేసీ
వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయితే సర్వనాశనం తప్పదని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటిదాకా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఏపీ... జగన్ సీఎం అయితే మళ్లీ వెనుకబడిపోతుందని చెప్పారు. గతంలో జగన్ కు అవకాశం ఉన్నప్పటికీ... దాన్ని ఆయన ఉపయోగించుకోలేకపోయారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబునే మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు ఎంతో దూరదృష్టి ఉన్న నాయకుడు అని కొనియాడారు.