: 12వ వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించిన స్పైస్‌ జెట్‌


ప్రముఖ ఎయిర్‌లైన్ విమానయాన సంస్థ త‌న‌ స్పైస్‌ జెట్‌ విమాన ప్రయాణికుల కోసం 12వ వార్షికోత్సవం సందర్భంగా కేవ‌లం రూ.12 ప్రారంభధరలో విమాన టికెట్లను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. టికెట్ల‌పై వేసే అదనపు ఛార్జీలు, ఇతర పన్నుల నుంచి మిన‌హాయించి నేటి నుంచి ప‌లు ఆఫ‌ర్ల‌ను తీసుకొచ్చిన‌ట్లు పేర్కొంది. ఈ ఆఫ‌ర్ల కోసం బుకింగ్‌లు ఈ నెల 28 వరకు చేసుకోవచ్చని తెలిపింది. ఈ బుకింగ్స్ చేసుకున్న వారు వ‌చ్చేనెల 26 నుంచి వ‌చ్చే ఏడాది మార్చి 24 వ‌ర‌కు ప్రయాణించవచ్చు. ఈ ఆఫ‌ర్‌ నాన్‌ స్టాప్‌ విమానాల‌కు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఆఫ‌ర్లే కాకుండా 12 సాల్‌, బడా ధమాల్‌ పేరుతో ఓ లక్కీ డ్రా కూడా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎయిర్‌లైన్ ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్ లో టికెట్లు బుక్‌ చేసుకుంటే ఉచిత విమాన టికెట్లు,ఇతర బహుమతులను పొందే అవ‌కాశం, మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. పూర్తి వివ‌రాల కోసం ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ చూడ‌వ‌చ్చు.              

  • Loading...

More Telugu News