: నారా లోకేష్ పై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేతలు సీబీఐకి ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలోని దసపల్లా హిల్స్ భూ కుంభకోణానికి సంబంధించి వీరు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ. 1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారంటూ ఫిర్యాదులో ఆరోపించారు. కురుపాం రాజ వంశస్థురాలు రాణీ కమలమ్మను ఇందులో బినామీగా చేర్చారని తెలిపారు. అనంతరం మీడియాతో వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీఐ ద్వారా ఈ వివరాలను సేకరించామని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరగకపోతే హైకోర్టుకు కూడా వెళతామని చెప్పారు.