: ఈ సినిమా పేరు కనిపెట్టండి... నాతో సెల్ఫీ దిగండి: తాప్సీ ఆఫర్
త్వరలో మరో తెలుగు చిత్రంతో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్న అందాలతార తాప్సీ, ఓ సవాల్ ను అభిమానుల ముందుంచింది. ఈ నెల 28న ఫస్ట్ లుక్ విడుదల కానున్న తన కొత్త చిత్రం టైటిల్ పోస్టరును ట్విట్టర్ లో ఉంచుతూ, సినిమా టైటిల్ కనిపెట్టి చెప్పిన వాళ్లకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పింది. పేరును కరెక్ట్ గా చెప్పి తనకు ట్వీట్ చేస్తే, వారితో సెల్ఫీ దిగుతానని ఆఫర్ ఇచ్చింది. కాగా, 70 ఎంఎం ఎంటర్ టెయిన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్యాగ్ లైన్ 'భయానికి నవ్వంటే భయం'. తాప్సీ పెట్టిన ట్విట్టర్ పోస్టు ఇదే!
Back on screens in Telugu! Guess the title of my next to WIN a selfie with MEEEE