: తాత వైయస్ రాజారెడ్డికి ఘన నివాళి అర్పించిన జగన్
తన తాత వైయస్ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఘన నివాళి అర్పించారు. రాజారెడ్డి 19వ వర్ధంతి కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలసి జగన్ హాజరయ్యారు. రాజారెడ్డి ఘాట్ వద్ద వీరు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, రాచమల్లు ప్రసాదరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.