: భారీ వర్షం కారణంగా నీట మునిగిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం!
ప్రఖ్యాత ఆథ్యాత్మిక క్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నీట మునిగింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతం జలమయమైంది. దీంతో, భక్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. రాత్రి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. చిరు జల్లుగా మొదలైన వర్షం... భారీ వర్షంగా మారింది. వర్షం తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చెట్లు కూలిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాణిపాకం చుట్టుపక్కలున్న పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.