: భూమా అస్థికలను సప్తనదుల్లో నిమజ్జనం చేసిన అఖిలప్రియ!

దివంగత భూమా నాగిరెడ్డి అస్థికలను ఆయన కుమార్తెలు భూమా అఖిలప్రియ, మౌనిక, కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు కర్నూలు జిల్లా సంగమేశ్వరంలోని సప్త నదుల్లో నిన్న నిమజ్జనం చేశారు. అంతకు ముందు నాగిరెడ్డికి ఆయన కుమారుడు జగత్ తో పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ ఆలయ ప్రాంగణంలో పిండప్రదానం చేయించారు. అనంతరం సంగమేశ్వరాలయంలోని వేపదారు శివలింగానికి అభిషేకం చేయించారు. ఈ సందర్భంగా వీరి వెంట ఏవీ సుబ్బారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. దివంగత శోభానాగిరెడ్డి అస్థికలను కూడా ఇక్కడే నిమజ్జనం చేయడం గమనార్హం.