: రేపు హైదరాబాద్ వస్తున్న చంద్రబాబు.. మినీ మహానాడుకు హాజరు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ టీడీపీ నిర్వహించనున్న మినీ మహానాడులో ఆయన పాల్గొంటారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మినీ మహానాడు జరగనుంది. ఏపీ పాలనా వ్యవహారాల్లో అనుక్షణం బిజీబిజీగా ఉండే చంద్రబాబు... హైదరాబాదులో జరగనున్న మినీ మహానాడుకు వస్తారా? లేదా? అనే సందేహం తొలుత అందర్లోను తలెత్తింది. అయితే, తెలంగాణ టీడీపీ నేతలు ఆయనను కలసి, కచ్చితంగా రావాల్సిందేని కోరారు. దీంతో, ఆయన మినీ మహానాడుకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పార్టీ పండుగకు తమ అధినేత విచ్చేస్తుండటంతో... టీటీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. మరోవైపు, మినీ మహానాడుకు ఏర్పాట్లన్నీ భారీగా జరుగుతున్నాయి.