: పాపం అల్లు అర్జున్... ఇంకా తగ్గని 'డిస్ లైక్'ల దెబ్బ!
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'దువ్వాడ జగన్నాథం' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని "డీజే శరణం భజే భజే" అనే పాటను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన టీజర్ తరహాలోనే ఈ వీడియోకి కూడా డిస్ లైక్ లు వెల్లువ ప్రారంభమైంది.
గతంలో జరిగిన ఒక ఆడియో ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు కోరగా, అల్లు అర్జున్ స్పందిస్తూ, 'మాట్లాడను బ్రదర్' అంటూ చేసిన వ్యాఖ్యలు పవర్ స్టార్ అభిమానులను గాయపరిచాయి. దీంతో అప్పటి నుంచి అల్లు అర్జున్ వీడియో ఏది విడుదలైనా దానికి లైకుల వెల్లువ ప్రారంభమైన కాసేపటికే.. డిస్ లైకుల వెల్లువ కూడా ప్రారంభమవుతోంది. దీంతో తాజాగా ఈ పాట వీడియోకి కూడా డిస్ లైకులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. దీంతో అభిమానుల ఆగ్రహం చల్లారేదెప్పుడో, డిస్ లైక్ లు తగ్గేదెన్నడోనని చిత్ర నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు.