: పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు: చంద్రబాబు స్పష్టీకరణ


విజయవాడ ఎంపీ కేశినేని నాని బీజేపీపై చేసిన వ్యాఖ్యలు పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ-టీడీపీ పొత్తుపై ఆయన వ్యాఖ్యలు పెను ప్రభావం చూపుతాయన్న రాజకీయ పరిశీలకుల అభిప్రాయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. పార్టీ నేతలు హద్దుల్లో ఉండాలని హెచ్చరించారు. గీత దాటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తాను సమస్యలు పరిష్కరిస్తూ వస్తుంటే... నేతలు సమస్యలు కొనితెస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేతలు పరిధులు దాటి మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలకు నేరుగా ఆయన హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. కాగా, దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News