: సౌదీ ఖర్జూరాల రుచి చూసిన ట్రంప్.. సంప్రదాయ దుస్తుల్లో విందుకు హాజరైన మెలానియా
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన గౌరవార్థం రాజు సల్మాన్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఆయన సతీమణి మెలానియా ట్రంప్ అరబ్ మహిళలు ధరించే సంప్రదాయ దుస్తుల్లో విందుకు హాజరై అందరినీ అలరించారు. పర్యటన తొలిరోజు అరబ్ మహిళలు ధరించే స్కార్ఫ్‌ను ధరించేందుకు నిరాకరించిన మెలానియా ఈసారి సంప్రదాయ దుస్తుల్లో విందుకు హాజరుకావడం గమనార్హం. ఈ సందర్భంగా విందులో ఏర్పాటు చేసిన ఖర్జూర పళ్లను ట్రంప్ రుచి చూశారు. ప్రత్యేకంగా చేయించిన అరబ్ స్వీట్లు, కాఫీని రాజు సల్మాన్ అందించారు. ట్రంప్ పర్యటనకు సూత్రధారి అయిన ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్, కుమార్తె ఇవాంకా కూడా విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరబ్ సంస్కృతీసంప్రదాయాలను ట్రంప్ ఆస్తకిగా గమనించారు.