: పాత 500 నోటు నుంచి 5 ఓల్టుల విద్యుత్ తయారీ... ఒడిశా యువకుడి అద్భుత ఆవిష్కరణ


ఎందుకూ పనికిరావని భావించిన 500 రూపాయల పాత నోట్లను ఒడిశాకు చెందిన యువకుడు ప్రయోజనకరంగా మార్చి, అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీసి సంచలనం రేపాడు. దీనిపై ప్రధాని కార్యాలయం నివేదిక కోరడంతో అతని ఆవిష్కరణపై ఆసక్తి కలుగుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఒడిశాలోని నౌపడి జిల్లాలోని దుండికి చెందిన లచ్‌ మన్‌ (17) అనే యువకుడు దీనిని ఆవిష్కరించాడు. దీని గురించి అతను చెబుతూ ‘‘పాత 500 రూపాయల నోటును చిన్నగా చించితే సిలికాన్‌ పూత బయపడుతుంది. ఆ పూతకు ఎలక్ట్రిక్ తీగ సాయంతో ఒక చిన్నపాటి ట్రాన్స్ ఫార్మర్ ను అనుసంధానం చేసి, కరెన్సీ నోటులోని సిలికాన్ పూతపై నేరుగా సూర్యరశ్మి పడేలా చేయడంతో విద్యుత్ ఉత్పత్తవుతుంది. ఇలా ఉత్పత్తయ్యే విద్యుత్ ను ట్రాన్స్ ఫార్మర్ నిల్వ చేస్తుంది. ఒక్కో 500 రూపాయల నోటు నుంచి 5 ఓల్టుల విద్యుత్ ను తయారు చేయగలం" అని తెలిపాడు.

రద్దయిన నోట్లను అత్యుత్తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలన్న ఆలోచనే తాజా ఆవిష్కరణకు దారితీసిందని లచ్ మన్ స్పష్టం చేశాడు. దీనిని పరిశీలించి, నివేదిక సమర్పించాలని ప్రధాని కార్యాలయం గత నెల 12న ఒడిన ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆ బాధ్యతను ఒడిశా శాస్త్ర, సాంకేతిక రంగానికి ఆ బాధ్యతలు అప్పగించింది.

  • Loading...

More Telugu News