: రోడ్డున పడ్డ ఐటీ ఉద్యోగులు యూనియన్ల వేటలో బిజీబిజీ!


ఉద్యోగాల్లోంచి అకారణంగా, బలవంతంగా తమను తొలగిస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఐటీ ఉద్యోగులు తమను రక్షించే వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. యూనియన్ల వేటలో బిజీగా ఉన్నారు. బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న కంపెనీల నుంచి తమకు కనీసం నష్టపరిహారం అయినా ఇప్పించే వారి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కంపెనీ నుంచి ఎప్పుడు ఫోన్ కాల్ వస్తుందో, ఎప్పుడు రాజీనామా చేయమంటారో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

బెంగళూరులోని ఓ ఎమ్మెన్సీ కంపెనీలో పదేళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఓ మహిళకు సంస్థ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. కంపెనీకి వచ్చి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోవాలని కోరడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తనకు రెండు రోజుల సమయం కావాలని ఆమె కోరింది. తనకు చిన్న బాబు ఉన్నాడని, ఇంటి కోసం తీసుకున్న రుణం వాయిదాలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్న ఆమె తనకు మరో ఉద్యోగం దొరికేంత వరకు ఎలా గడపాలని ప్రశ్నించింది. కంపెనీ నుంచి పరిహారం రాకుండా బయటకు వెళ్తే కష్టాలపాలు కావాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఒక్క ఆమె వ్యధ మాత్రమే కాదు.. ఐటీ ఉద్యోగులందరిదీ.

ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని ఉద్యోగులు కంపెనీ నుంచి తమకు రావాల్సిన పరిహారం ఇప్పించి, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సిందిగా కోరుతూ బెంగళూరుకు చెందిన  ఐటీ ఎంప్లాయీస్ సెంటర్ (ఐటీఈసీ)ను ఆశ్రయిస్తున్నారు. తమను బలవంతంగా రిజైన్ చేయమంటున్నారని ఫిర్యాదు చేస్తూ రోజూ పదుల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత మూడు వారాల్లో 200కు పైగా ఫోన్లు వచ్చినట్టు తెలిపారు.  అలాగే చెన్నైకి చెందిన ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఎఫ్ఐటీఈ), నేషనల్ డెమొక్రటిక్ లేబర్ ఫ్రంట్ (ఎన్‌డీఎల్ఎఫ్) వంటి కార్మిక సంఘాలను కూడా ఆశ్రయిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు 500 మందికిపైగా ఐటీ ఉద్యోగులు తమకు ఫిర్యాదు చేసినట్టు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News