: కాంగ్రెస్ నేతపై దాడి చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, అనుచరులు.. కేసు నమోదు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులపై హైదరాబాదులో కేసు నమోదు అయింది. హైదరాబాదులో జరిగిన ఓ పంక్షన్ కు ఎమ్మెల్సీ హనుమంతరావు, తన అనుచరులతో హాజరయ్యారు. అదే వివాహానికి కాంగ్రెస్ నేత రమేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చిన్న వాగ్వాదం చిలికి చిలికి ఘర్షణగా మారింది. దీంతో రమేష్ పై మైనంపల్లి, టీఆర్ఎస్ కార్పొరేటర్ జితేంద్రనాథ్ లు దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ పోలీసులకు పిర్యాదు చేసేందుకు వెళ్లగా, అక్కడ కూడా కార్పొరేటర్ అనుచరులు దాడి చేశారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ లో కరెంటు లేకపోవడంతో ఆ దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కలేదు. దీనిపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో మైనంపల్లి, అతని అనుచరులపై పలు సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు.