: జట్టు నుంచి ధోనీని తొలగించడం అంత ఈజీ కాదు.. అటువంటి వ్యక్తి జీవితంలో ఒకసారే వస్తాడు: మాజీ సెలక్టర్ విక్రమ్ రాథోడ్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ లాంటి వారు జీవిత కాలంలో ఒక్కసారే వస్తారని, అతడిని జట్టు నుంచి తప్పించడం అంత తేలికైన విషయం కాదని టీమిండియా మాజీ సెలక్టర్ విక్రమ్ రాథోడ్ వ్యాఖ్యానించాడు. ధోనీ ఇప్పటికీ మంచి ఫినిషర్‌గా అద్భుతంగా ఆడగలడని కీర్తించిన ఆయన చాంపియన్స్ ట్రోఫీలో ధోనీ లాంటి ఆటగాడు ఉండడం చాలా అవసరమన్నాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచిన ధోనీ భారత్‌కు వన్డే, టీ20 ప్రపంచకప్‌లు అందించాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. ఐపీఎల్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి జట్టు యాజమాన్యం అతడిని తప్పించింది. అయినప్పటికీ అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.