: ఇంగ్లాండ్ పై పంజా విసిరిన ఉగ్రవాదులు... సంగీత కచేరీలో ఆత్మాహుతి దాడి!


ఉగ్రవాదులు ఇంగ్లాండ్‌ పై పంజా విసిరారు. ఆత్మాహుతి దాడితో విరుచుకుపడి అన్నెంపున్నెం ఎరుగని అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్‌ ఎరీనాలో అరియాణా గ్రాండే సంగీత కచేరి జరుగుతున్న సమయంలో భారీ ఎత్తున గుమిగూడి ఉన్న సంగీత ప్రియులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయని బ్రిటన్‌ మీడియా తెలిపింది. వెంటనే భద్రతా దళాలు స్పందించి క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఇతరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News