: ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, నీళ్లు లేవు: టీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ రెడ్డి ధ్వజం
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఈ రోజు టీడీపీ నేతలు మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. తెలంగాణలో దొంగల రాజ్యం నడుస్తోందని ఆయన అన్నారు. మూడేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి అప్పులే మిగిలాయని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని ఆయన అన్నారు. తెలంగాణలో ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, నీళ్లు లేవని ఆయన వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా నుంచే టీఆర్ఎస్ పతనం మొదలు కావాలని తమ నేతలకు పిలుపునిచ్చారు.