: గతనెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు ఇదే!


గత నెలలో మారుతి సుజుకి ఇండియాకి చెందిన‌ స్విఫ్ట్ కార్లు ఏకంగా 23,802 అమ్ముడు పోయాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) తెలిపింది. దీంతో డొమెస్టిక్ మార్కెట్‌లో గణనీయమైన అమ్మకాలు సాధించి అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఏప్రిల్‌లో ఈ కార్లు 15,661 మాత్రమే అమ్ముడయ్యాయి. కాగా, ఈ సారి టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఆ కంపెనీకే చెందిన ఏడు కార్లు నిలిచాయి. మిగతా మూడు కార్లు హుందయ్ కంపెనీకి చెందినవి. 2016 ఏప్రిల్‌లో మారుతికే చెందిన ఆల్టోకార్లు అత్యధికంగా అమ్ముడుపోయాయి. ఈ సారి మాత్రం స్విఫ్ట్ ముందంజ‌లో నిలిచింది.

  • Loading...

More Telugu News