: జియో సబ్ స్క్రైబర్ల వేగం తగ్గడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాం: యూఎస్బీ


మార్కెట్లోకి అడుగుపెడుతూనే మిగ‌తా టెలికాం కంపెనీల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన రిల‌య‌న్స్ జియో ప్ర‌స్తుతం కొత్త వినియోగ‌దారులను సంపాదించుకోవ‌డంలో వెన‌క‌బ‌డిపోతోందట‌. ఈ ఏడాది మార్చి నెలలో జియో 5.8 మిలియన్ సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే, అంత‌కు ముందు నెలలో జియోకి వ‌చ్చిన‌ 12.2 మిలియన్ సబ్ స్క్రైబర్లతో పోల్చితే, ఇప్పుడు యాడ్ అయిన‌ వినియోదారుల సంఖ్య ఎంతో త‌క్కువ‌గా ఉండ‌డంతో జియోకి ప్ర‌స్తుతం డిమాండ్ ప‌డిపోయింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

 తాజాగా ట్రాయ్ డేటా ఆధారంగా యూఎస్బీ ఓ రిపోర్టును విడుద‌ల చేసింది. మార్చి నెలలో జియో వినియోగ‌దారులు విప‌రీతంగా త‌గ్గిపోవ‌డం చూసి తామెంతో ఆశ్చర్యానికి గురయ్యామని అందులో పేర్కొన్నారు. జియోకు పోటీగా ఎయిర్ టెల్‌, వొడాఫోన్ లాంటి కంపెనీలు కూడా బంపర్ ఆఫర్లను ప్రకటించడంతో ఆ కంపెనీల‌కు కూడా వినియోగ‌దారుల సంఖ్య పెరిగింద‌ని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండు వ్యాప్తి 20.9 శాతం ఉంద‌ని, మార్చిలో ఇది 22.1 శాతానికి పెరిగిందని తెలిపింది. గ‌త నెల నుంచి జియో ట్రాఫిక్ ప్లాన్ల‌ను అమ‌లుప‌రుస్తోన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News