: భారతీయ విద్యార్థి చేసిన పనికి అమెరికన్ యూనివర్శిటీ డీన్ విస్మయం... వీడియో చూడండి
అమెరికాలో భారతీయ విద్యార్థి వినమ్రతను అర్థం చేసుకోలేని డీన్ అయోమయానికి గురైన ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఇల్లినాయిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో జాయినైన విద్యార్థులను ఇండస్ట్రియల్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ తరగతులలోకి ఆహ్వానిస్తూ కమెన్స్ మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి స్టేజ్ మీదకి వెళ్లి డీన్ పాదాలకు నమస్కరించాడు.
ఈ సందర్భంగా డీన్ కు ఆ విద్యార్థి ఏం చేస్తున్నాడో అర్ధం కాలేదు. ఒక్క క్షణం బిత్తరపోయారు. ఇంతలో విద్యార్థి ఆయన కాళ్లకు నమస్కరించి, ప్రతిస్పందన కోసం చూడకుండా నిష్క్రమించాడు. అనంతరం విద్యార్థి తన కాళ్లకు నమస్కరించాడని డీన్ అర్థం చేసుకున్నారు. దీంతో ఈ సంఘటనపై అమెరికాలో తీవ్రమైన చర్చ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ట్విట్టర్ లో మాట్లాడుకుంటున్న వైరల్ అంశాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.