: ఎంబీఏ పట్టా అందుకున్న హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్!


లీడర్, నాగ‌వ‌ల్లి, మిర‌ప‌కాయ్‌, సారొచ్చారు, మిర్చి వంటి సినిమాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ తాజాగా గ్రాడ్యుయేట్ ప‌ట్టా అందుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమే త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. సెయింట్ లూయిస్ లోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ నుండి తాను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్(ఎం.బి.ఏ) ని స‌క్సెస్ ఫుల్‌గా పూర్తిచేశాన‌ని చెప్పింది. కొన్నాళ్లుగా ఈ అమ్మ‌డు సినిమాల‌కి దూరంగా ఉంటోన్న విష‌యం తెలిసిందే. త‌న చ‌దువుకోసం విదేశాల్లోనే గ‌డిపిన ఈ అమ్మ‌డు ఇక త‌న చ‌దువు అయిపోయింది క‌నుక మ‌ళ్లీ న‌టిస్తుంద‌ని సినీ ప‌రిశ్ర‌మ‌లో టాక్‌.



  • Loading...

More Telugu News