: ఇప్పుడు చెప్పు...అడవిలో రాజు ఎవరు?: పూణే యజమాని సోదరుడ్ని ప్రశ్నిస్తున్న ధోనీ అభిమానులు


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రైజింగ్ పూణే సూపర్ జెయింట్ జట్టు యజమాన్యం మధ్య విభేదాలతో ధోనీని జట్టు కెప్టెన్ గా తొలగించి, అతని స్థానంలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూణే జట్టు యజమాని సోదరుడు హర్ష్ గోయొంకా చేసిన పలు ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి. తొలి టీ20లో విజయం సాధించిన సందర్భంగా ధోనీ గణాంకాలను స్టీవ్ స్మిత్ గణాంకాలతో ఎత్తి చూపుతూ...అడవిలో రాజు ఎవరో తేలిపోయింది అంటూ ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో ధోనీ జట్టును ఫైనల్ కు చేర్చే ఇన్నింగ్స్ తో ఆకట్టుకోగా, వాషింగ్టన్ సుందర్, దోనీ, స్మిత్ ల పోరాట పటిమతో పూణే ఫైనల్ చేరిందని ట్వీట్ చేశాడు. దీంతో కొంత వివాదం సద్దుమణిగిందని అనుకునేలోపు...ఫైనల్ లో అలవోకగా గెలుస్తుందని భావించిన పూణే జట్టు ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. చివరి ఓవర్లో స్మిత్ అవుట్ కావడంతో పరాజయం పాలైంది. దీంతో గోయెంకాకు ధోనీ అభిమానులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అడవిలో పులి ఎవరు?...అడవిలో పులికి ఏమైంది? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అడవిలో రాజు ఎవరో తెలిసిందా? అంటూ విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News