: ఉమర్ అక్మల్ ను వెనక్కి రప్పించిన పీసీబీ


పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ను పీసీబీ వెనక్కి పిలిపించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్, ఉమర్ ను వెనక్కి రమ్మనడంతో పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో...ఉమర్ ఫిట్ నెస్ పరీక్షలో ఫెయిలయ్యాడని ప్రకటించింది. రెండు సార్లు ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించగా, రెండు సార్లు ఉమర్ అక్మల్ విఫలమయ్యాడు. దీంతో అతనిని పీసీబీ వెనక్కి రప్పించింది.

యూనిస్ ఖాన్, మిస్బావుల్ హక్ ల రిటైర్మెంట్ ప్రకటించడంతోను, అఫ్రిదీని తప్పించడంతోను పాక్ జట్టు కొంత బలహీనమైంది. అయితే పాక్ క్రికెట్ లీగ్ తో వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లతో జట్టును కోచ్ ఇంజమామ్ ఉల్ హక్ బలోపేతం చేశాడు. ఈ నేపథ్యంలో భారత్ పై పాక్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే, తాజాగా స్టార్ బ్యాట్స్ మన్, కీపర్ ఉమర్ అక్మల్ ను కూడా స్వదేశం రప్పించడంతో ఆ జట్టు మరింత బలహీనంగా మారినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News