: సాధారణ భక్తులతో కలిసి క్యూలో నిలబడి.. అమ్మవారిని దర్శించుకున్న దేవసేన అనుష్క


బాహుబలి సినిమాలో దేవసేన పాత్రలో అద్భుతంగా నటించిన అనుష్క కర్ణాటక కొల్లూరులోని మూకాంబిక ఆలయాన్ని దర్శించుకుంది. అయితే, ఓ వీఐపీలా ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కాకుండా సాధార‌ణ భ‌క్తుల్లాగే క్యూలో నిల‌బ‌డి మ‌రీ అమ్మ‌వారిని ద‌ర్శనం చేసుకుంది. తన తల్లి ప్రఫుల్లా, తండ్రి విఠల్‌, సోదరుడు గుణరంజన్‌, సామాజిక కార్యకర్త-రాజకీయ నాయకుడు ముత్తప్పరాయ్‌తో క‌లిసి ఆమె అక్క‌డ ప్రత్యేక పూజ‌ల్లో పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా ఆమె తండ్రి విఠ‌ల్ మీడియాతో మాట్లాడుతూ.. త‌న కూతురికి దైవభక్తి ఎక్కువని చెప్పారు. రజనీకాంత్‌తో కలిసి ‘లింగ’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు త‌న కూతురు మూకాంబిక ఆల‌యానికి త‌రుచూ వెళ్లేద‌ని అన్నారు. ఇటీవ‌ల విడుద‌లైన‌ ‘బాహుబలి 2’ అద్భుత విజ‌యాన్ని అందుకున్న నేప‌థ్యంలో తాము అనుష్క‌తో క‌లిసి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నామ‌ని అన్నారు.                      

  • Loading...

More Telugu News