: సెక్రటేరియట్ ను కూల్చేందుకు ప్రయత్నిస్తే... చూస్తూ ఊరుకోం: టీటీడీపీ సీనియర్ నేత రావుల
సచివాలయాన్ని కూల్చే పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడితే... చూస్తూ ఊరుకోబోమని టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని... కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా సాధించుకోలేకపోయిందని విమర్శించారు. హైదరాబాదులో జరగనున్న టీడీపీ మహానాడులో 8 తీర్మానాలు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. విశాఖలో జరిగే మహానాడుకు వెళ్లేందుకు తెలంగాణ నుంచి రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.