: తెలంగాణలోనూ మనమే అధికారంలోకి వస్తాం: నల్గొండలో అమిత్‌ షా


తెలంగాణ‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ఈ రోజు నల్గొండ జిల్లాకు చేరుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జిల్లాలోని చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు. అక్క‌డ బీజేపీ జెండాను ఆవిష్కరించి, ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర స‌ర్కారు పథకాల అమలును గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవ‌ల మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన మైస‌య్య విగ్ర‌హాన్ని అమిత్ షా ఆవిష్కరించిన త‌రువాత కార్య‌క‌ర్త‌ల‌తో ముచ్చ‌టించారు. మోదీ స‌ర్కారు పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. తమ పార్టీ తెలంగాణలోనూ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News