: నారాయణరెడ్డి అంత్యక్రియలకు హాజరైన జగన్
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ నారాయణరెడ్డి అంత్యక్రియలకు ఆ పార్టీ అధినేత జగన్ హాజరయ్యారు. వెల్దుర్తి మండలం చెరుకులపాడులో నారాయణరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. కాసేపట్లో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చెరుకులపాడుకు భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. గ్రామం మొత్తం వైసీపీ వర్గీయులు, అభిమానులతో నిండిపోయింది.