: నారాయణరెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యే: తమ్మినేని
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ చెరకులపాడు నారాయణ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఓ పథకం ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిలు ఈ హత్య చేయించారని ఆరోపించారు. టీడీపీ పాలనలో హంతకులు, రౌడీలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడక ముందే గవర్నర్ నరసింహన్ స్పందించి... చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.